ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు ఘంటసాల పురస్కారం
చెన్నయ్, ఫిబ్రవరి 18 (ఆన్‌లైన్) ప్రముఖ నేపధ్యగాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం 'ఘంటసాల పురస్కారం' అందుకోను న్నారు. చెన్నయ్‌కి చెందిన షెరాన్ ఇన్‌కార్పొరేషన్, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) సంయుక్తంగా ఈ అవార్డు అందించనున్నాయి. షెరాన్ ఇన్‌కార్పొరేషన్ సంస్థ గత ఏడాది నుంచి దివంగత గాయకుడు ఘంటసాల పేరుతో ప్రతిభావంతులైన గాయకులకు అవార్డు ఇస్తోంది. తొలిసారిగా సీనియర్ గాయకుడు పీబీ శ్రీనివాస్‌కు ఈ పురస్కారం అందజేసింది.
ఈ ఏడాదికి గాను పురస్కారాన్ని ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు ఇవ్వనున్నట్లు షెరాన్ సంస్థ నిర్వాహకులు రమణ గురువారం ప్రకటించారు. ఆస్కా అధ్యక్షులు కె.నరసారెడ్డి, ట్రస్టీ జేకే రెడ్డి, కోశాధికారి సాంబశివరావు తదితరులతో కలిసి రమణ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ ఈ ఏడాది 'ఆస్కా షెరాన్ ఇన్‌కార్పొరేషన్ ఘంటసాల పురస్కార్ అవార్డ్' పేరుతో ఎస్‌పీబీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్ర 6 గంటలకు టి.నగర్‌లోని ఆస్కా ప్రాంగణంలో వున్న గోదావరి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగనున్నట్లు తెలిపారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలైమామణి డాక్టర్ పీబీ శ్రీనివాస్ హాజరవుతారన్నారు.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆస్కా అధ్యక్షులు కె.నరసారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. గ్రహీతకు పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ప్రదా నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల గాన విభావరితోపాటు, ఘంటసాలపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు 5.45 గంటలకే సీట్లలో ఆశీనులు కావాల్సి వుందన్నారు.
ఈ కర్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనన్నారు. అనంతరం నరసారెడ్డి మాట్లాడుతూ ఘంటసాల పేరిట ఇచ్చే అవార్డు ప్రదానోత్సవంలో ఆస్కా పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. అదే విధంగా ఆస్కా సభ్యులు కూ డా అయిన ఎస్‌పీబీకి అవార్డు ఇవ్వ డం, ఆ కార్యక్రమం ఆస్కా ప్రాంగణంలో జరగడం మరింత సంతోషంగా వుందన్నారు. ఆస్కా సభ్యులతో పాటు, ఇతర తెలుగు కార్యక్రమాలన్నింటికీ ఆస్కాలోని ఆడిటోరియాలను ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
తెలుగు వారికి, తెలుగు కార్యక్రమాలకు ఆస్కా అందుబాటులో వుండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తెలుగు వారికి ఉపయోగ పడే కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అం దించడానికి తాము సిద్ధంగా వున్నామన్నారు. వచ్చే ఏడాది జరిగే ఘంటసాల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తమతో పాటు తమ సభ్యులు కూడా భాగస్వాములవుతారని ప్రకటించారు. అనంతరం జేకే రెడ్డి మాట్లాడుతూ అపర సరస్వతీ పుత్రుడైన ఎస్‌పీీకి ఘంటసాల పురస్కారం రావడం పట్ల సం తోషంగా వుందన్నారు. కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇంకా ఈ సమావేశంలో సాంబశివరావు, శ్రీనివాస్,మధు తదితరులు కూడా మాట్లాడారు.
No comments:
Post a Comment